తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి పాల్పడ్డ ఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి
భార్యాభర్తల గొడవపై గుగులోతు కోటేశ్వర్ భార్య చంద్రకళ 112కి కాల్ చేయగా, స్పందించి ఇంటికి వెళ్లిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రు అక్కడికి వెళ్ళగా సుమారు గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో
నిందితుడుగుగులోతు కోటేశ్వరరావు అనే వ్యక్తి కానిస్టేబుల్ పై కత్తితో ఇనుప రాడ్ తో దాడికి పాల్పడినట్టు, సమాచారం, ఈ దాడిలో కానిస్టేబుల్ కు గుండెకు కింది భాగములో కత్తి తగిలి తీవ్ర రక్తస్రావం అయిందని, సుమారు తొమ్మిది కుట్లు పడినట్లు సమాచారం. ఈ ఘటనతో తొర్రూరు పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు, పోలీసులకే ఇలాంటి ఘటనలు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉన్మాదులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో నిరంతరం, రాత్రింబవళ్లు గల్లి గల్లి పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈ
దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, సమాచారం అందుకున్న ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రామచంద్రుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం.తొర్రూరు పట్టణ కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ఇలాంటి ఉన్మాదులు ఆకతాయిలు విచ్చలవిడిగా వీధుల వెంట సంచరిస్తూ, సెటిల్మెంట్లు, పలు దందాలు కూడా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కావున ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు పోలీసు ఉన్నత అధికారులు చేపట్టాలని, స్థానికులు భావిస్తున్నారు.

