📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఏఐటియుసి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్

సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏఐటియుసి రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఎల్కతుర్తి బస్టాండ్ ఆవరణలో జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్,సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మీద ప్రధాన చర్చ ఉంటుందని నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని ప్రతి కార్మికుడికి 8 గంటల పనిదినాన్ని యధావిధిగా కొనసాగించాలని ప్రతి కార్మికుడికి నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాదబీమా సౌకర్యం వాళ్ల జీవనోపాధికి కనీస సౌకర్యాలు అయినటువంటి కూడు,గుడ్డ,నీడ సౌకర్యం కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి గడ్డం రాజనర్సు మండల నాయకులు వేముల కృష్ణకర్,బిల్కూరితులసి రామ్,ఎర్ర ప్రకాష్ రాజు,ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.