ఎండపల్లి మండల కేంద్రంలో కొడుకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో బొంగని కిష్టయ్య (79) అనే వృద్ధుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన రెండవ కుమారుడు సత్తయ్య ఊరిలో పలువురి వద్ద అప్పులు చేసి, తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కిష్టయ్య బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
కొడుకు చేసిన అప్పులు తీర్చలేక, వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య
RELATED ARTICLES

