.సెప్టెంబర్ 9న చలో వరంగల్ జాతీయ మహాసభను విజయవంతం చేద్దాం.
– జిల్లా ఇంచార్జ్ చాతాళ్ల రమేష్ మాదిగ పిలుపు.
గోవిందరావుపేట(ప్రజావాణి)
గోవిందరావుపేట మండలం, పసర గ్రామ కేంద్రంలో గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల MRPS, MSP నూతన మండల కమిటీల ఎన్నిక సమావేశం ఘనంగా జరిగింది.
గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల ఇన్చార్జ్ గజ్జల ప్రసాద్ మాదిగ, కో-ఇన్చార్జ్ తోకల రాంబాబు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS, MSP ములుగు జిల్లా ఇన్చార్జ్ చాతాళ్ల రమేష్ మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సెప్టెంబర్ 9న వరంగల్ లో జరగబోయే జాతీయ MRPS, MSP మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సామాజిక, ఆర్థిక అసమానతలపై భవిష్యత్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
అనంతరం MSF మాదిగ విద్యార్థి సమైక్య ములుగు జిల్లా కో-ఇన్చార్జ్ పేరాల బలరాం మాదిగ మాట్లాడుతూ జాతీయ మహాసభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
*నూతనంగా ఎన్నికైన కమిటీలు:*
*MRPS గోవిందరావుపేట మండల కమిటీ:*
– అధ్యక్షులు: కేశపాక కార్తీక్ మాదిగ
– అధికార ప్రతినిధి: కొయ్యడ శ్రీకాంత్ మాదిగ
– ప్రధాన కార్యదర్శి: నద్దునూరి రంజిత్ మాదిగ
*MSP గోవిందరావుపేట మండల కమిటీ:*
– అధ్యక్షులు: తిప్పనపెల్లి సురేష్ మాదిగ
– అధికార ప్రతినిధి: రాంబాబు మాదిగ
ఈ కార్యక్రమంలో పసర గ్రామ అధ్యక్షులు చుంచు యాకుబ్ మాదిగ, మొద్దులగూడెం గ్రామ అధ్యక్షులు ఎనగందుల రమేష్ మాదిగ, మండల సీనియర్ నాయకులు పంగ శీను మాదిగ, ఏల్పుల సాంబయ్య, గోనెపల్లి సమ్మయ్య మాదిగ, పసుల సమ్మయ్య మాదిగ, తిక్క దుర్గారావు మాదిగ, చుంచు ఎల్లస్వామి మాదిగ, పసులాది సాంబయ్య, ఆత్కూరు నరేష్ మాదిగ, పోకల సుదర్శన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

