📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetనంగునూర్‌లో పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలు 

నంగునూర్‌లో పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలు 

📰 Generate e-Paper Clip

ప్రజావాణి -నంగునూరు ఆగస్టు29: సిద్ధిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలు నంగునూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. నంగునూరు మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. బాణాసంచా పేల్చారు. పూజల హరికృష్ణకు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏఎంసి వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి పూజల హరికృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రజల కోసం మరింతగా సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాపోల్ రాజహుదూర్ రెడ్డి, ఎండీ. ఇమ్రాన్, కర్ణకంటి.రవీంద్ర చారి, సర్పంచులు రాధాకృష్ణ, మైపాల్ రెడ్డి, రంగు. అశోక్, రంగారెడ్డి, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, జీవన్ నాయక్, ప్రభాకర్, సామ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కాటన్ కనకయ్య, చిన్న అజ్మత్,వెంకటేష్, రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.