-
.పంటలకు నీళ్లు లేవు.. ఈసారి ఎల్ నినో రైతుల్లో ఆందోళన.
ములుగు జిల్లా ( ప్రజావాణి ):-
రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ లో పంటలకు నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాభావంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండక పంటలు ఎండిపోతున్నాయి.
దీనికి ప్రధాన కారణం ఈసారి ఎల్ నినో ప్రభావం అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
భారత వాతావరణ శాఖ (IMD) ఈసారి నైరుతి రుతుపవనాలు 92% మాత్రమే ఉంటాయని ప్రకటించింది. ఇది గత 25 ఏళ్లలోనే అత్యల్ప అంచనా.
సాధారణంగా మనకు 70% వర్షం ఈ రుతుపవనాల నుండే వస్తుంది. 70% వ్యవసాయం వర్షం మీదనే ఆధారపడి ఉంది.
ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల భారత రుతుపవనాలు బలహీనపడటం సార్. గత 6 ఎల్ నినో సంవత్సరాలలో 6 సార్లు భారత్ లో తక్కువ వర్షపాతం నమోదైంది.
ప్రపంచ వాతావరణ సంస్థల అంచనా ప్రకారం జూన్ – ఆగస్టు 2026 మధ్య 62% ఎల్ నినో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
దీని ప్రభావంతో వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి ఖరీఫ్ పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.అంతేకాదు నేలలో తేమ తగ్గి రబీ సీజన్ లో వేసే గోధుమ, ఆవాలు పంటలకు కూడా ఇబ్బంది వస్తుంది.ఇప్పటికే జూన్ నెలలో 40% వర్షపాతం లోటు ఉందని IMD తెలిపింది. సెప్టెంబర్ లో పరిస్థితి మరింత దిగజారి 15% లోటు వరకు వెళ్లవచ్చని, ఇది 2009 తర్వాత అత్యల్పమని అధికారులు అంటున్నారు.
రైతులు ఈసారి తక్కువ నీరు అవసరమయ్యే పప్పుధాన్యాలు, జొన్నలు వంటి పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
లేకపోతే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే ప్రమాదం ఉంది.

