ఎన్.టి.ఆర్. జిల్లా,విజయవాడ.ఆగస్టు 29 ప్రజావాణి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “హరితాంధ్రప్రదేశ్” కార్యక్రమంలో భాగంగా నగర పోలీస్ కమీషనర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్,అడ్మిన్ డి.సి.పి.శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.ముఖ్య అతిధులుగా విచ్చేసి,కార్యాలయ ప్రాంగణంలో స్వయంగా మొక్కలు నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.పచ్చదనం,పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని కోరారు. పోలీస్ శాఖ తరఫున శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వామ్యం కావాలని అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు అడ్మిన్ డి.సి.పి.శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.ఎ.ఆర్.డి.సి.పి.శ్రీ బి.సత్యనారాయణ,ఎ.ఆర్.ఎ.డి.సి.పి.శ్రీ ఎన్.వి.రమణ,ఎ.ఆర్.ఎ.సి.పి.లు శ్రీ రామకృష్ణం రాజు,ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యాలయ ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు.నాటిన మొక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారు.
హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో మొక్కలు నాటిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్
RELATED ARTICLES

