హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో మొక్కలు నాటిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్
ఎన్.టి.ఆర్. జిల్లా,విజయవాడ.ఆగస్టు 29 ప్రజావాణి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "హరితాంధ్రప్రదేశ్" కార్యక్రమంలో భాగంగా నగర పోలీస్ కమీషనర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్,అడ్మిన్ డి.సి.పి.శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.ముఖ్య అతిధులుగా విచ్చేసి,కార్యాలయ ప్రాంగణంలో స్వయంగా మొక్కలు నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.పచ్చదనం,పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.భావితరాలకు స్వచ్ఛమైన...