📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతంతో మృతి - బాధిత కుటుంబానికి టి.ఆర్. ఫౌండేషన్ అండ

ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతంతో మృతి – బాధిత కుటుంబానికి టి.ఆర్. ఫౌండేషన్ అండ

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని టి.ఆర్. ఫౌండేషన్ ఆదుకుంది. నల్గొండ పట్టణంలో ఇటీవల ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మృతితో కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పిలుపు మేరకు టి.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ టామ్ రెడ్డి రూ. 30,000/- ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అవకాశం. ఈ సందర్భంగా టామ్ రెడ్డి మాట్లాడుతూ “బాధిత కుటుంబానికి టిఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కి, టిఆర్ ఫౌండేషన్ చైర్మన్ టామ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.