📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaసవాలు విసిరినా రాని కూసుకుంట్ల

సవాలు విసిరినా రాని కూసుకుంట్ల

📰 Generate e-Paper Clip

చండూరులో తీవ్ర చర్చనీయాంశమైన మాజీ ఎమ్మెల్యే గైర్హాజరు

మాట నిరూపించుకున్న చైర్మన్ కోడి శ్రీనివాసులు…

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

​మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విసిరిన ప్రమాణాల సవాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బీఆర్‌ఎస్ ధర్నా కార్యక్రమంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, కౌన్సిలర్లు, చైర్మన్ లంచాలు తీసుకున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను కౌంటర్ చేస్తూ చైర్మన్ కోడి శ్రీనివాసులు శనివారం ఉదయం 9:00 గంటలకు చండూరు శిర్దపల్లి రోడ్డులోని శ్రీ అంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాలు విసిరిన సంగతి తెలిసిందే.
​అయితే, మున్సిపల్ చైర్మన్ సవాలు చేసిన సమయానికి ఆలయం వద్దకు కోడి శ్రీనివాసులుతో పాటు పాలకవర్గం, వర్తకులు, వ్యాపారస్తులు చేరుకుని ప్రమాణానికి సిద్ధమవ్వగా, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాత్రం హాజరుకాకపోవడం గమనార్హం.
​ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక నాయకులు, తమపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు లేదా స్వామివారి ముందర ప్రమాణం చేసేందుకు కూసుకుంట్ల వెనుకాడారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాకపోవడం ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తేలిపోయిందని, ప్రజలు ఆయన మాటలను ఇకపై నమ్మరని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంటనే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, మున్సిపల్ పాలకవర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు కలిమికొండ పారిజాత జనార్ధన్, బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న,కటకం రమేష్,కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, కల్లెట్ల మారయ్య చంద్రకళ, షరీఫ్, మొగుదాల వెంకన్న, మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ ఐతరాజు మల్లేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి వెంకటేష్ యాదవ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నబోయిన నాగరాజు, భీమనపల్లి శేఖర్, కారింగు రామ్మూర్తి, మండల మహిళా అధ్యక్షురాలు పందిరి రాధా, గంట యాదయ్య, చిట్టిపోలు మహేష్, బొమ్మ కంటి ఆంజనేయులు, ఏకాలపు ఆంజనేయులు, కోయగూర చక్రి, నల్ల కృష్ణయ్య, జూలూరు వెంకటేశం, పున్న సైదులు, స్థానిక వైన్ షాప్ యజమానులు, పండ్లబండి వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.