📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaప్రీ ప్రైమరీ నియామకాలు వెంటనే చేపట్టాలి ---- రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం

ప్రీ ప్రైమరీ నియామకాలు వెంటనే చేపట్టాలి —- రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ సెక్షన్లకు ఇన్‌స్టాక్టర్, ఆయాలను నియమించడంలో జాప్యాన్ని నిరసిస్తూ సంఘం ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ వ్యక్తుల ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యా బోధన ప్రారంభించింది. కానీ మన జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయాల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలు గడిచిన తరువాత నేటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయకపోవడం వల్ల ఆయా పాఠశాలల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల విద్యాబోధన తీవ్ర స్థాయిలో ప్రభావవంతంగా ఉంటుంది, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడి ఆ పాఠశాల విద్యార్థుల విద్యా బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తల్లిదండ్రులకు నమ్మకం కోల్పోయి తమ పిల్లలను తిరిగి ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్తున్నారని, దీని వలన తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడి ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా ప్రక్రియ ఆగిపోయిందని అనడంలో అర్థం లేదని, అధికారులు చట్టానికి లోబడి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి మాట్లాడుతూ తగు చర్యలు తీసుకొని నల్లగొండ 124 ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బోధనకు జిల్లాలో ఇన్‌స్ట్రక్టర్ల నియామకాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటాలు టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సాయి, కోశాధికారి వడ్త్య రాజు, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్ రెడ్డి, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాసరెడ్డి, మురళయ్య, నలపరాజు వెంకన్న, ఏ చిన్న వెంకన్న, కొమరాజు సాయి, ఆడిట్ కమిటీ సభ్యులు నరసింహమూర్తి, భాను ప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ యరనాగుల సాయి, రాగి. సరళ, పద్మ, రమణమ్మ, సూర్య కళ, సంధ్య, రమణ, నాగయ్య మరియు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు, సెలక్షన్ జాబితాలో మెరిట్‌లో ఉన్న అభ్యర్థులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.