📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadజిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా శ్రీమతి పంజా కల్పన నియామకం.

జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా శ్రీమతి పంజా కల్పన నియామకం.

📰 Generate e-Paper Clip

జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా శ్రీమతి పంజా కల్పన నియామకం.

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నివారణకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో తొర్రూరు పట్టణానికి చెందిన శ్రీమతి పంజా కల్పన గారికి సభ్యురాలిగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా పంజా కల్పన గారు హర్షం వ్యక్తం చేశారు.

SC/మాల సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ కీలకమైన కమిటీలో సభ్యురాలిగా అవకాశం కల్పించిన పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారికి, శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి పంజా కల్పన గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. కమిటీ సభ్యురాలిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ SC/ST వర్గాల హక్కుల పరిరక్షణకు, అట్రాసిటీ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, కమిటీ చైర్‌పర్సన్, స్నేహ శబరిష్, ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. SC/ST (అట్రాసిటీల నివారణ) చట్టం అమలు, బాధితులకు న్యాయం, పరిహారం, పునరావాసం తదితర అంశాలపై కమిటీ సమీక్షించి, బాధితులకు అండగా నిలవనుంది.
తనకు లభించిన ఈ అవకాశాన్ని సామాజిక బాధ్యతగా భావించి, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని పంజా కల్పన గారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.