📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్లలో ఎమ్మార్పీఎస్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగి వసూళ్ల దందా: భయాందోళనలో వ్యాపారులు, విద్యాసంస్థల నిర్వాహకులు*

కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఎమ్మార్పీఎస్ పేరు చెప్పుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి సాగిస్తున్న వసూళ్ల పర్వం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. “అడిగినంత ఇస్తే సరే.లేదంటే అంతను కొంతమంది నిరుద్యోగ యువకులను పోగు చేసి చర్చి ఫాదర్ ల మీద స్కూల్ ల మీద రాజకీయ నాయకుల మీద  బెదిరింపులు మరియు వసుల్ల పర్వం కొనసాగిస్తున్నారు “అంటూ ఆయన సాగిస్తున్న బెదిరింపులపై సర్వత్రా  ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.రాజకీయ నాయకుల నుంచి కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాహకుల వరకు ఈ ముసుగు వీరుడి బాధితుల జాబితా పెరుగుతోంది.ఉద్యమం ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ పర్వం,సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఏర్పాటైన ఒక గౌరవప్రదమైన ఉద్యమ సంస్థ పేరును అడ్డం పెట్టుకుని, సదరు ప్రభుత్వ ఉద్యోగి సొంత లాభం కోసం వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ప్రభుత్వ జీతం తీసుకుంటూనే,మరోపక్క ఉద్యమకారుడిని అంటూ చట్టాన్ని, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకునేలా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ నాయకులే టార్గెట్: స్థానిక రాజకీయ సమీకరణాలను ఆసరాగా చేసుకుని నాయకులను బుజ్జగించడం లేదా బెదిరించడం ఈయన శైలి.కార్పొరేట్ స్కూళ్లపై కన్ను: చిన్నపాటి లోపాలను కూడా భూతద్దంలో చూపిస్తూ,కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలను టార్గెట్ చేసి భారీగా డబ్బులు లాగుతున్నట్లు సమాచారం.బ్లాక్‌మెయిలింగ్ అస్త్రం:డబ్బులు ఇస్తే మీ జోలికి రాము.ఇవ్వకపోతే మీపై లేని తప్పులను కూడా ఉన్నట్లు నిరూపించి సమాజంలో మీ ప్రతిష్టను దిగజారుస్తాం”అంటూ నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.ఎవరు ఈ ముసుగు వీరుడు?ప్రజల్లో పెరిగిన గుసగుసలు,తమ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఈ వ్యక్తి అసలు ప్రభుత్వ ఉద్యోగేనా? లేక ఉద్యమకారుడా?అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏలాంటి రాజకీయ,లేదా ఒత్తిడి తెచ్చే సంఘాల్లో క్రియాశీలకంగా ఉండకూడదు.కానీ,ఈ వ్యక్తి మాత్రం రెండు పడవలపై ప్రయాణం చేస్తూ,చట్టాన్ని చుట్టరికం చేసుకుంటున్నాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.తప్పు చేయకపోయినా ఎక్కడ తమ పేరు సమాజంలో పాడవుతుందోననే భయంతో చాలామంది నోరు మెదపడం లేదు.

సంఘం పరువు తీస్తున్న వైనం

నిజాయితీగా హక్కుల కోసం పోరాడే నిజమైన ఎమ్మార్పీఎస్ నాయకులు,కార్యకర్తలు ఈ వ్యవహారంపై ఆందోళన చెందుతున్నారు.ఒక ప్రభుత్వ ఉద్యోగి స్వార్థ ప్రయోజనాల కోసం సంస్థ పేరు వాడుకోవడం వల్ల, నిజమైన ఉద్యమకారులకు చెడ్డపేరు వస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నకిలీ ముసుగు వీరుల ఆట కట్టించాల్సిన బాధ్యత అటు సంఘం పెద్దలపై, ఇటు అధికారులపై ఉంది.తక్షణ చర్యలు అవసరం, పోరుమామిళ్ల మండలంలో ఈ తరహా బెదిరింపులకు, వసూళ్లకు అడ్డుకట్ట పడాలంటే ఉన్నతాధికారులు మరియు పోలీసులు తక్షణమే స్పందించాలి. సదరు ప్రభుత్వ ఉద్యోగి ఎవరు అనే కోణంలో విచారణ జరిపి, ఆయన అక్రమ వసూళ్లపై నిఘా పెట్టాలి. బాధితులు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి అక్రమాలకు శాశ్వతంగా ముగింపు పడుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.