కెసిఆర్ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి.లేకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం.
కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి.లేకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం.
కేటీఆర్ ఆదేశాలతో పోతంగల్లో బీఆర్ఎస్ ఆందోళనలు, ధర్న.
పోతంగల్/ప్రజావాణి:-కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రజారంజక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా నిర్వీర్యం చేస్తోందని పోతంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూదం నవీన్,షేక్ హారీఫ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పోతంగల్ మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయం ఎదుట మండల బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ తో పాటు ఇతర సంక్షేమ పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్వో కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సూదం నవీన్,షేక్ హారీఫ్ మాట్లాడుతూ.కెసిఆర్ కాలంలో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందేదనీ.ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి చంపేస్తున్నారనీ వాపోయారు.రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం నిలిచిపోవడంతో పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్ప డుతున్నాయని,అప్పులు చేసే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 అలాగే అర్హులైన వధువులకు రూ.1 లక్ష నగదుతో పాటుగా 10 గ్రా.ల బంగారం ఇస్తామని చెప్పార నీ.అది నేటికి ఈరోజు అమలు కాలేదని.వరకు ఆ హామీల ఊసే లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయకుండా కొనసాగించా లని.పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సహాయం త్వరగా అందించాలని డిమాం డ్ చేశారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించక పోతే హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.ఈ ధర్నాలో ఏజాజ్,సాగర్,సూదం సాయిలు,పట్నం సాయిలు,బిఖ్య నాయక్,అఫ్రోజ్,రసూల్ ఖాన్,ఇబ్రహీం,మంద ప్రవీణ్,రాములు,గణేష్,సిద్దు,ఇమ్రాన్, సునీల్,సింహంద్రీ,అవేస్ ఖాన్,జలాల్,సలీం,బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

