ఘట్కేసర్, ఆగస్టు 15: తహసీల్దార్ కార్యాలయంలో 81వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, ప్రజాసేవ ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం, కావ్యారెడ్డి, గ్రామ పరిపాలన అధికారులు సత్యనారాయణ, శ్రవణ్, మంజుల, అశోక్, మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ , మున్ని, రవితేజ, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

