.
ప్రజావాణి న్యూస్ మిర్యాలగూడ. నియోజకవర్గంలోని మెడికల్ షాప్ ఓనర్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులు అందరూ కలిసి పట్టణంలోని శరణ్య గ్రీన్ హౌస్ ఓన్ బిల్డింగ్ లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను అధ్యక్షులు గోవర్ధన్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ నల్లగొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ మరియు ఏడి రవికుమార్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో డిఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలియజేస్తూ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అనేవాడు ఒక రకమైన సమాజ సేవకుడు సేవ చేసే క్రమంలో కూడా నిస్వార్థపూరితంగా సమాజంలోని ప్రజలకు కీడు చేయకుండా మేలు చేసే విధంగా ఉంటూ మన జీవనాన్ని గడపాలని భావితరాలకు బాటలు వేయాలని కోరారు. తదనంతరం ఏడి రవికుమార్ మాట్లాడుతూ మిర్యాలగూడలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ ల ఆధ్వర్యంలో ఇంత చక్కని వాతావరణం లో మంచి బిల్డింగ్ నిర్మాణం చేసుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకకు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ ఐక్యత అనేది ఈ విషయంలోనే అర్థమవుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక మెడికల్ షాప్ లో ప్రభుత్వాలు కొత్త కొత్త రూల్స్ ను తెస్తున్నాయి వాటికి అనుగుణంగా మందులను అమ్మాలని ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీకి అలవాటు పడాలని వ్యాపార వృద్ధిలో ముందు ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ మరియు ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ ట్రెజరర్ నరేష్ యాదవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి రషీద్ మరియు వివిధ ఏజెన్సీల యాజమాన్యాలు మెడికల్ షాపుల కెమిస్ట్లు మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


