📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyచించోడు పీహెచ్‌సీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చించోడు పీహెచ్‌సీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

**
షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 15 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ స్రవంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రజలంతా ఐక్యతతో ముందుకు సాగాలని, భారతదేశ గౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ఆరోగ్య వ్యవస్థలో కీలక భాగమని ఆమె పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, టీకాలు, కుటుంబ నియంత్రణ, అంటువ్యాధుల నివారణ, ఎన్‌సీడీ స్క్రీనింగ్, పోషకాహారం, పారిశుద్ధ్యం, ఆరోగ్య అవగాహన వంటి సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడం ఆరోగ్య సిబ్బంది బాధ్యత అని తెలిపారు.
హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మాట్లాడుతూ.. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు తదితర స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాటను నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలు, సురక్షితమైన తాగునీరు, పోషకాహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, వ్యాధులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా “నా ఆరోగ్యం–నా బాధ్యత, నా కుటుంబ ఆరోగ్యం–నా బాధ్యత, నా గ్రామ ఆరోగ్యం–మన అందరి బాధ్యత” అనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాలు అందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ వైద్య అధికారులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ ముస్తకిన్ అహ్మద్, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీరామ, ఫార్మసిస్ట్ పర్వతాలు, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, స్టాఫ్ నర్స్ అరుణ, ఏఎన్‌ఎంలు, కాంటింజెంట్ వర్కర్లు శ్రీను, మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.