చించోడు పీహెచ్‌సీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

**షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 15 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ స్రవంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రజలంతా ఐక్యతతో ముందుకు...