హాసనపర్తి: మన తెలంగాణ ఆటో యూనియన్ హాసనపర్తి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ఐక్యతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు యూనియన్ సభ్యులు తెలిపారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా తాళ్ల మధు, గౌరవాధ్యక్షులుగా జన్ను కిషన్, జన్ను చేరాలు, మేకల సాంబయ్య, ఉపాధ్యక్షుడిగా బిగుల్లా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మట్టెడ శ్రీనాథ్, జనరల్ సెక్రెటరీ దాట్ల సునీల్ క్యాషియర్‌గా కుక్కల మొగిలి మైస రమేష్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా , గొర్రె బాబు, మేకల ప్రభాకర్, తాళ్ల మహేందర్, రుద్రారపు రవీందర్, ఎండి గౌస్ పాషా, ఆరేపల్లి శ్రీనివాస్, బిగుల్లా ఇసాక్, జన్ను అనిల్, మేకల కిరణ్, మట్టెడ లక్ష్మయ్య, శరీరపు రవీందర్, తాళ్ల సంపత్, ఇమ్మడి రాజేష్, జన్ను కుమార్, తాళ్ల రమేష్, జన్ను ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను యూనియన్ సభ్యులు అభినందించారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, రవాణా సంబంధిత సమస్యలు, పార్కింగ్, ప్రయాణికుల భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
నూతన అధ్యక్షుడు తాళ్ల మధు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. డ్రైవర్ సోదరులందరినీ కలుపుకొని యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆటో డ్రైవర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మన తెలంగాణ ఆటో యూనియన్ నాయకులు, నూతన కార్యవర్గ సభ్యులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హాసనపర్తి మన తెలంగాణ ఆటో యూనియన్‌కు నూతన కార్యవర్గం
RELATED ARTICLES

