యూనియన్ అధ్యక్షుడు మాలోతు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
ఖమ్మం, ఆగస్టు 15 (మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి): ఖమ్మం రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ (రిజిస్ట్రేషన్ నం. బి/312) ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మాలోతు లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆటో డ్రైవర్లు, రైల్వే అధికారులు, ప్రయాణికులు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మాస్టర్ ఆర్.పి.సి.ఐ. మాట్లాడుతూ ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దేశభక్తి భావనతో సేవలందించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపేందర్‌తో పాటు గండు కనకారావు, నరసయ్య, సీతయ్య, గాడేపల్లి కృష్ణ, షేక్ శాలి, షేక్ అబ్దుల్ నబి, ఉపేందర్, ఆనంద్, కృష్ణ, వనం భద్రం, సాగర్, వహీద్, శ్రీను, సైదులు, కాసిం, ఉప్పలి, రాము, వెంకటేశ్వర్లు, నాగేశ్వరావు, దావీదు, పాప, ఈరన్న, అచ్చాలు, సారయ్య, ఇమామ్, జానీ తదితర యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించి, దేశ సేవకు అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.


