📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialవిద్యాకుసుమానికి అరుదైన గౌరవం: సూరారంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం పాఠశాల విద్యార్థి...

విద్యాకుసుమానికి అరుదైన గౌరవం: సూరారంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం పాఠశాల విద్యార్థి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి ఆగస్టు 15 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక విద్యార్థి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం ఎగరడంతో స్థానిక విద్యార్థుల్లో, గ్రామస్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ… విద్యార్థుల్లో దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు చదువుపై మరింత ఆసక్తిని పెంచడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా జరిగే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విద్యాపరంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జాతీయ జెండాను ఆవిష్కరించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం పాఠశాల విద్యార్థులందరికీ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, చాక్‌మార్లతో పాటు మిఠాయిలను పంపిణీ చేశారు. యూత్ అసోసియేషన్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరును గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొడిపెల్లి కొమరమ్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ చెలుపూరి రవీందర్, మాజీ సర్పంచ్ కొంగల రాంరెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రవి, యూత్ సభ్యులు రాకేష్, గణేష్, శేఖర్, సంతోష్, సాగర్, వంశీ, సతీష్, భాస్కర్, రాహుల్, సాగర్, రంజిత్, సాజన్ కుమార్, పవన్, వెంకటేష్, హరీష్, ఆనంద్, సాగర్, రామ్‌చరణ్, నరేష్, సాయి, రమేష్, పవన్, మణిదీప్, శ్రావణ్ కుమార్, విష్ణు, శ్రావణ్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.