📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్దేశభక్తితో పరిమళించిన సెయింట్ ఆన్స్ హైస్కూల్

దేశభక్తితో పరిమళించిన సెయింట్ ఆన్స్ హైస్కూల్

📰 Generate e-Paper Clip

దేశభక్తితో పరిమళించిన సెయింట్ ఆన్స్ హైస్కూల్

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు

మేడ్చల్, ఆగస్టు 15: దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా మేడ్చల్ పరిధిలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ లూర్దు రత్న అధ్యక్షతన జరిగిన వేడుకల్లో అడ్వకేట్ జంగా శ్రీకాంత్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం విద్యార్థుల జాతీయ గీతాలాపనతో పాఠశాల ఆవరణం దేశభక్తి భావంతో మార్మోగింది.

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు, నాటికలు, పిరమిడ్ ప్రదర్శనలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విద్యార్థులు పాల్గొని వారి త్యాగాలను, దేశానికి చేసిన సేవలను వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ లూర్దు రత్న, ముఖ్యఅతిథి జంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించుకుని భవిష్యత్తులో దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించే పౌరులుగా ఎదగాలని సూచించారు.

కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. “భారత్ మాతా కీ జై”, “జై హింద్” నినాదాలతో పాఠశాల ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.