📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaసీసీ కెమెరాలతో భద్రత మరింత పటిష్టం

సీసీ కెమెరాలతో భద్రత మరింత పటిష్టం

📰 Generate e-Paper Clip

సీసీ కెమెరాలతో భద్రత మరింత పటిష్టం

ప్రతి దుకాణం,ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఎల్కతుర్తి సీఐ పులి రమేష్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలోని ప్రజలు,వ్యాపారులు ముందస్తు జాగ్రత్తగా తమ దుకాణాలు,ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులిరమేష్ సూచించారు.
గ్రామాల్లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి కిరాణా షాప్,ఇతర వ్యాపార సంస్థల ముందు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు.ఒక సీసీ కెమెరా వంద మంది కాపలా కాసినంత విలువైనదని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి వీలైనంత వరకు తమ ఇళ్ల ముందు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు
గ్రామాల్లో గల్లీగల్లీలో చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తూ జీవనం సాగించే వ్యాపారులు కూడా తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామాల్లో జరుగుతున్న చిన్నచిన్న చోరీలు,అనుమానాస్పద కార్యకలాపాలను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది తమ ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను ఇంటి బయట లేదా పరిసర ప్రాంతాల్లో ఉంచుతున్నారని విలువైన వస్తువులను తప్పనిసరిగా ఇంటి లోపల భద్రంగా ఉంచాలని సూచించారు. కొంత ఖర్చు అయినప్పటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఇళ్లు,దుకాణాలకు భద్రత మరింత పెరుగుతుంది
గ్రామాల్లో తిరుగుతూ ప్లాస్టిక్ బాటిళ్లు,గాజు సీసాలు,ఇతర పాత వస్తువులను సేకరించే వ్యక్తులు కూడా ఉంటారని,వారు ఎక్కడికి వెళ్తున్నారు,ఏం చేస్తున్నారు అనే విషయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండి,అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలిపాలనీ ఎల్కతుర్తి సీఐ పులిరమేష్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.