EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetమున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఎరగాని నాగన్న గౌడ్.

మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఎరగాని నాగన్న గౌడ్.

📰 Generate e-Paper Clip

మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.
ఎరగాని నాగన్న గౌడ్.

హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి)

అనారోగ్యంతో గత వారంలో మృతి చెందిన మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని, రాష్ట్ర ఐఎన్టియసి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ అన్నారు.
హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ దారెల్లి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చిత్రపటానికి నివాళులు అందించారు.
ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ రాములు మృతి బాధాకరమని, మున్సిపాలిటీలో తన విధులను నిబద్ధతతో నిర్వహించిన ఆయన సేవలు మరువలేనివని అన్నారు. రాములు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాములు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోల్లపూడి యోహాన్, మాజీ కౌన్సిలర్ చింతకాయల రాము, ఐఎన్టియుసి రైస్ మిల్స్ అధ్యక్షులు సలిగంటి జానయ్య, యూత్ నాయకులు కిరణ్, మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Previous article
*ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలి* .నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి పరిసరాలను ఆకర్షణీయంగా సుందరీకరించాలి. .జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)* రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ములుగు జిల్లా పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు పరిసరాలను ఆకర్షణీయంగా సుందరీకరించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌ను, గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ నిర్మాణం పనులను పరిశీలించి, గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హెలిప్యాడ్ వద్ద చేపడుతున్న బారికేడింగ్, వీవీఐపీ వేచి ఉండే టెంట్, భద్రతా ఏర్పాట్లతో పాటు పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పైలాన్ నిర్మాణంతో పాటు ఇతర పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆకర్షణీయంగా సుందరీకరించాలని ఆదేశించారు. గట్టమ్మ దేవాలయ పరిసరాల పరిశుభ్రత, సుందరీకరణ, వాహనాల పార్కింగ్ స్థలాలు, భద్రత తదితర అంశాలను సమీక్షించి, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న పైలాన్ పనుల పురోగతిని పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం, స్టేట్ బోర్డ్ ఛాంబర్, జిల్లా కలెక్టర్ ఛాంబర్ తో పాటు వివిధ కార్యాలయ గదులను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి, ఆర్డీవో కృష్ణవేణి, మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఎస్పీ రవీందర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ములుగు తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.