📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadఎత్తొండ క్యాంప్‌లో ఉచిత జనరల్ వైద్య శిబిరం.

ఎత్తొండ క్యాంప్‌లో ఉచిత జనరల్ వైద్య శిబిరం.

📰 Generate e-Paper Clip

ఎత్తొండ క్యాంప్‌లో ఉచిత జనరల్ వైద్య శిబిరం.

గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు,మందుల పంపిణీ.

స్టార్ హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామ సర్పంచ్.

 

కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంప్ గ్రామంలో మంగళవారం స్టార్ హాస్పిటల్ కోటగిరి సౌజన్యం తో గ్రామ సర్పంచ్ గైని వీరమణి అర్జున్ అధ్యక్షతన ఉచిత జనరల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.ఈ క్యాంప్లో స్టార్ హాస్పిటల్ డాక్టర్లు గణేష్,మాధురి గ్రామస్తులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.వివిధ ఆరోగ్య సమస్యలపై సూచనలు చేసి చిన్నపాటి అనారోగ్య సమస్య లున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అలాగే క్యాంపులో షుగర్,బీపీ పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా బాధి తులకు తగు జాగ్రత్తలు,ఆహార నియమాలు పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గైని వీరమణి అర్జున్ మాట్లాడుతూ.గ్రామంలో ఉచితంగా జనరల్ హెల్త్ క్యాంప్ నిర్వహించిన స్టార్ హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్యాంపులు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో అవసరమని అన్నారు.అనంతరం స్టార్ హాస్పిటల్ యాజమాన్యం,సిబ్బం దికి గ్రామ సర్పంచ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉప సర్పంచ్ కోనేరు తరుణ్ సాయి తేజ,వార్డు మెంబర్లు ఇక్బాల్,రాములు,జమీర్, సునీత,రాజేశ్వరి,గ్రామ పెద్దలు,గ్రామస్తులు,స్టార్ హాస్పిటల్ కోటగిరి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.