దోమలేడ్గిలో ఘనంగా సంత్ శిరోమణి నాందేవ్ మహారాజ్ 676వ పుణ్యతిథి.
ఉమ్మడి కోటగిరి మేరు సంఘం ఆధ్వర్యంలో 3వ ఏటా వేడుకలు.
కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండలంలోని దోమలేడ్గి గ్రామంలోని విఠలేశ్వరం మందిరం వద్ద సంత్ శిరోమణి నాందేవ్ మహారాజ్ 676వ పుణ్యతిథి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆగస్టు 10,11 తేదీలలో ఉమ్మడి కోటగిరి మండల మేరు సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిం చారు.గత మూడు సంవత్సరాలుగా దోమలేడ్గి గ్రామంలో ఈ పుణ్యతిథి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఉమ్మడి కోటగిరి మండల మేరు సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కామప్ప మహారాజ్ (భరంగెడ్గి) అధ్యక్షతన సోమవారం భజనలు,జాగరణలు నిర్వహించారు.మంగళవారం నాందేవ్ మహారాజ్ కీర్తనలు, జీవిత చరిత్ర ప్రవచనాలు జరిగాయి.అనంతరం విచ్చేసిన భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కామప్ప మహారాజు మాట్లాడుతూ. భగవం తుడు ఒక్కడే అని.అన్ని జీవులలోనూ ఆయనే ఉన్నాడనీ. కాబట్టి మనం కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలన్నారు.నిజమైన భక్తి అంటే మాటలతో కాదు,సేవతో చూపించాలనీ సంత్ నాందేవ్ మహారాజ్ బోధనలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల మేరు సంఘం అధ్యక్షులు గంట్ల రవీందర్,దోమలేడ్గి గ్రామ సర్పంచ్ కోడూరు దేవిక శ్రీధర్,గ్రామ పెద్దలు అనంత విఠల్ పటేల్,అనంత దిగంబర పటేల్,జేల్ల గంగాధర్,జేల్ల శ్రీధర్, మాగ్డేవార్ రాములు,తుకారం గౌడ్,దత్త గౌడ్,సూర్యకాంత్, నరేష్,రాజు,సుంకిని,దోమలేడ్గి భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
