📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamటి వి వి పి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది...

టి వి వి పి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఎక్కడ?

📰 Generate e-Paper Clip



*రోగులకు వైద్యం అందకపోతే బాధ్యత ఎవరిది
తక్షణ తనిఖీలు  నిర్వహించి చర్యలు తీసుకోవాలి*

*బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి దారేల్లి రమేష్ డిమాండ్*

*మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి ఆగస్టు 8*


ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో దారేల్లి రమేష్ మాట్లాడుతూ  ఖమ్మం జిల్లాలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టి వి విపి )పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే పేద, సామాన్య ప్రజలకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండటం లేదనే అయన అన్నారు,
రోగులు గంటల తరబడి ఆసుపత్రుల్లో వేచి ఉండాల్సి రావడం, సంబంధిత వైద్యుడు అందుబాటులో లేకపోవడం, అత్యవసర సమయాల్లో సరైన వైద్య సేవలు అందకపోవడం వంటి పరిస్థితులు అనేకం జరుతున్నవి అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న పీ హెచ్ సి లలో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండడం లేదు,మరియు డ్యూటీ టైం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాల్సిన డాక్టర్లు  అసలు రోగులకు అందుబాటులో ఉండడం లేదు.అసలు డాక్టర్లు వస్తే వస్తారు లేకపోతే లేదు,వారు రాకపోగా అక్కడే లోకల్ గా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ తో మేనేజ్ చేసుకుని విధులకు రాకపోవడం వలన తిరుమలాయపాలెం, నెలకొండపల్లి,మధిర,సత్తుపల్లి, తదితర పి హెచ్ సి లలో రోగులకు డాక్టర్ అందుబాటులో లేకపోవడం వలన అనేక మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు, ఈ డాక్టర్స్ ఖమ్మంలో మరియు మధిర లో ప్రైవేట్ హాస్పిటల్ లో మరియు వివిధ క్లినిక్ లలో విధులు నిర్వహిస్తూ లక్షలలో డబ్బులు సంపాదిస్తున్నారు,చిన్న మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం ప్రభుత్వ ఆసుపత్రిలోకి పోతే డాక్టర్స్ లేకపోవడం వలన వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు,ప్రతి హాస్పిటల్లో సరైన ఫార్మసీలు కూడా అందుబాటులో ఉండడం లేదు అదే విధంగా ప్రతి పీ హెచ్ సి లలో పారిశుధ్య లోపం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
అందువల్ల మెడికల్ సూపరింటెండెంట్ మరియు సంబంధితటి వి.వి.పి ఉన్నతాధికారులు వెంటనే
వైద్యులు, నర్సింగ్ మరియు ఇతర సిబ్బంది హాజరు రిజిస్టర్లు, బయోమెట్రిక్ హాజరును పరిశీలించాలి.
డ్యూటీ రోస్టర్‌కు అనుగుణంగా ఎవరు విధుల్లో ఉన్నారో తనిఖీ చేయాలి.
ఓ పి డి, అత్యవసర విభాగం, వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
రాత్రి వేళల్లో డ్యూటీ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారా పరిశీలించాలి.
రోగులు, వారి బంధువుల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించి విచారణ చేయాలి.
విధుల్లో నిర్లక్ష్యం లేదా అనధికార గైర్హాజరు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
సిబ్బంది కొరత ఉన్న ఆసుపత్రుల్లో అవసరమైన పోస్టులను తక్షణం భర్తీ చేయాలి.
మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
“వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉన్నారా?” అనే అంశాన్ని కేవలం రికార్డుల ఆధారంగా కాకుండా, ఆకస్మికంగా ఆసుపత్రులను తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి దారిల్లి రమేష్ డిమాండ్ చేశారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.