📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyప్రొఫెసర్ జయశంకర్ జయంతి – ప్రజాకవి గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బి ఆర్ ఎస్...

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి – ప్రజాకవి గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బి ఆర్ ఎస్ నాయకులు

📰 Generate e-Paper Clip

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి – ప్రజాకవి గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బి ఆర్ ఎస్ నాయకులు

మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 07(జోగిపేట్) సంగారెడ్డి  జిల్లా ప్రతినిధి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి, ప్రజాకవి గద్దర్ తొలి వర్ధంతి సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రజాకవి గద్దర్ తన పాటల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించి, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజాకవిగా నిలిచారని కొనియాడారు.
ఈ సందర్భంగా  చైర్మన్ డి బి నాగభూషణం, మాల మహానాడు నాయకులు మాల్లేశం మరియు బి ఆర్ ఎస్ నాయకులు కరుణకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సారు అని తెలంగాణ సాధన తోపాటు ప్రజల కోసం తన గళం తో ఎన్నో గేయాలు పాడి ప్రజల హృదయల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు గద్దరన్న అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో  చాపల వెంకటేశం, సార శ్రీధర్, దాసరి దుర్గయ్య, పరి పూర్ణం, రఫిక్, సటికే. రాజు, పల్లే వెంకట రమణ, వేణు గోపాల్, ఎర్రోళ్ల నర్సింలు, సంజీవులు ప్రజా సంఘాల నాయకులు దీన బందావ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular