📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguవిద్యుత్ అంతరాయాలకు చెక్ గాంధీనగర్ లో కొత్త లైన్లు

విద్యుత్ అంతరాయాలకు చెక్ గాంధీనగర్ లో కొత్త లైన్లు

📰 Generate e-Paper Clip

.సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న.

గాంధీనగర్ గ్రామపంచాయతీలో ₹5.30 లక్షలతో విద్యుత్ లైన్ల మరమ్మత్తు పనులు ప్రారంభం

గోవిందరావుపేట (ప్రజావాణి)

గ్రామంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించేందుకు ₹5 లక్షల 30 వేల రూపాయలతో చేపట్టిన మరమ్మత్తు పనులను గ్రామ సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి సీతక్క సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
గ్రామంలో పాత విద్యుత్ లైన్లు, స్తంభాలు శిథిలావస్థలో ఉండటంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయన్నారు.
రైతులు, గృహ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పనుల్లో భాగంగా దెబ్బతిన్న వైర్ల మార్పు, కొత్త స్తంభాల ఏర్పాటు వంటి పనులు జరుగుతాయని విద్యుత్ అధికారులు తెలిపారు.
అనంతరం లైన్ ఇన్స్పెక్టర్ రామచందర్ లైన్మెన్ తిరుపతి లను గ్రామ పాలకవర్గం సన్మానించింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్మద, ఉప సర్పంచ్ వల్లపు మహేష్, వార్డు సభ్యులు మాలోతు శంకర్, తేజావత్ హుని, రామావత్ సంధ్య, బిక్షపతి, కూరాకుల సురేష్ బాలవికాస ప్రతినిధి వినయ్ శంకర్ గ్రామ పెద్దలు, వివిధ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధికి ఇది మంచి ముందడుగు అని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular