విద్యుత్ అంతరాయాలకు చెక్ గాంధీనగర్ లో కొత్త లైన్లు

.సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న. గాంధీనగర్ గ్రామపంచాయతీలో ₹5.30 లక్షలతో విద్యుత్ లైన్ల మరమ్మత్తు పనులు ప్రారంభం గోవిందరావుపేట (ప్రజావాణి) గ్రామంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించేందుకు ₹5 లక్షల 30 వేల రూపాయలతో చేపట్టిన మరమ్మత్తు పనులను గ్రామ సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి సీతక్క సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గ్రామంలో పాత విద్యుత్ లైన్లు, స్తంభాలు శిథిలావస్థలో ఉండటంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయన్నారు. రైతులు, గృహ వినియోగదారులు...