📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarజమ్మికుంటలో వివేకానంద విగ్రహం తొలగింపు లేదు

జమ్మికుంటలో వివేకానంద విగ్రహం తొలగింపు లేదు

📰 Generate e-Paper Clip

జమ్మికుంటలో వివేకానంద విగ్రహం తొలగింపు లేదు

* స్వామి వివేకానంద విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు

* రథోత్సవాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం

జమ్మికుంట ఆగస్టు 4 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయ భూమిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందిఅదే సమయంలో దేవాలయ రథోత్సవాలు ఉత్సవాలు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందిఈ కేసులో దేవాలయ వ్యవస్థాపక ట్రస్టీ కొండూరు రాజ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సుద్దాల చలపతి రావు విచారణ జరిపారు. దేవాలయ భూమిలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల రథోత్సవాలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ వాదించారుఅయితే మున్సిపాలిటీ తరఫు న్యాయవాది విగ్రహం రోడ్ల కూడలిలోని ఐలాండ్‌పై ఏర్పాటు చేసినట్లు దేవాలయ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కోర్టుకు తెలిపారుఇరు పక్షాల వాదనలు సమర్పించిన పత్రాలు ఫొటోలను పరిశీలించిన హైకోర్టు రథోత్సవాల సమయంలో అవసరమైతే ట్రాఫిక్‌ను నియంత్రించాలనిరోడ్లను తాత్కాలికంగా మూసివేయాలని కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది దీంతో భక్తులు రథం ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేలా చూడాలనిసూచించిందిఅదేవిధంగావివేకానంద జయంతి వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమాలు నిర్వహించవచ్చని ఇతర సమయాల్లో అక్కడ జనసమూహం ఏర్పడి ప్రజలకు లేదా దేవాలయ కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో రిట్ పిటిషన్‌ను ముగిస్తూ ఎటువంటి కోర్టు ఖర్చులు విధించలేదు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular