📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaఅమ్మే అమృతం.. ముర్రుపాలే బిడ్డకు మొదటి కవచం!

అమ్మే అమృతం.. ముర్రుపాలే బిడ్డకు మొదటి కవచం!

📰 Generate e-Paper Clip

అమ్మే అమృతం ముర్రుపాలే బిడ్డకు మొదటి కవచం!

 

 

జగతికి మూలం అమ్మ.. ఆమె ప్రేమే బిడ్డకు రక్షాకవచం!

 

కేసముద్రం ఆగష్టు 06,ప్రజావాణి.

 

సృష్టిలో దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. కానీ నిజానికి, ఆ దేవుడి కంటే ముందే బిడ్డను కాపాడే ప్రత్యక్ష దైవం అమ్మ. ఉప్పరపల్లి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలు కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అది ప్రతి తల్లి యొక్క త్యాగానికి, ప్రేమకు దక్కిన గౌరవం.

 

 

రక్తాన్ని పాలగా మార్చే త్యాగమయి:

 

నవమాసాలు నరకయాతన అనుభవించి, ఒక ప్రాణానికి రూపమిచ్చిన తల్లి.. బిడ్డ పుట్టగానే తన రక్తాన్ని అమృతంగా (ముర్రుపాలుగా) మారుస్తుంది. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ఇచ్చే ఆ ముర్రుపాలు.. ల్యాబ్‌లలో శాస్త్రవేత్తలు తయారుచేసే ఏ వ్యాక్సిన్‌కూ తీసిపోవు. అందుకే వైద్యాధికారులు సైతం ముర్రుపాలే బిడ్డకు మొదటి టీకా అని కొనిాడుతున్నారు. తన బిడ్డ రోగాల బారిన పడకుండా, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆరాటపడే ప్రతి తల్లి ఒక గొప్ప యోధుడు.

 

బిడ్డ ఆరోగ్యమే తల్లి సంతోషం:

 

మొదటి ఆరు నెలలు కేవలం తన పాలు మాత్రమే ఇస్తూ, బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని ప్రసాదించే తల్లి.. సమాజానికి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిస్తోంది. తల్లి పాలు ఇవ్వడం వల్ల కేవలం బిడ్డకే కాదు, ఆ తల్లికి కూడా ఆరోగ్యం, ఆనందం చేకూరుతాయి. అమ్మా.. నీ ప్రేమకు సాటి ఏదీ లేదు. నువ్వు ఇచ్చే ప్రతి చుక్క పాలు నా బిడ్డ భవిష్యత్తుకు పునాది అని సమాజం గుర్తించినప్పుడు ప్రతి తల్లి ముఖంలో కొండంత ఆనందం కనిపిస్తుంది. ఈ వారోత్సవాల సాక్షిగా, బిడ్డల ఆకలి తీరుస్తూ, వారిని ఆరోగ్యంగా పెంచుతున్న లోకంలోని ప్రతి అమ్మకూ పాదాభివందనాలు!ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో సూపెర్వైజర్ బి.జ్యోతి,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సర్పంచ్ సునీత కుమస్వామి. ఏ డబ్ల్యుటి కే.యశోద, పి. పద్మ.యం. సరిత,బి.సునీత మరియు ఆరోగ్య సిబ్బంది,వార్డు సభ్యులు తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular