తెలంగాణలో అత్యవసర సేవలకు ఇక 112 ఒక్కటే నంబర్
హైదరాబాద్: తెలంగాణలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇకపై 112 నంబర్‌కు కాల్ చేస్తే పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక, మహిళల భద్రత తదితర సేవలు ఒకే వేదిక ద్వారా అందుబాటులోకి వస్తాయి. గతంలో పోలీస్ సేవల కోసం ఉపయోగించిన 100 నంబర్‌ను 112తో అనుసంధానం చేశారు.
ప్రజలు ప్రమాదాలు, నేరాలు, వైద్య అత్యవసర పరిస్థితులు లేదా అగ్నిప్రమాదాల సమయంలో 112కు ఫోన్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. అలాగే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 112 ఇండియా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎస్ఓఎస్ (SOS) సేవలను కూడా వినియోగించుకోవచ్చని సూచించారు.
ఒక్క నంబర్ – 112 ద్వారా అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉండడంతో ప్రజలు ఈ సేవను అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.


