📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaకొద్దిపాటి వర్షానికే జలమయం అవుతున్న 9వ వార్డు

కొద్దిపాటి వర్షానికే జలమయం అవుతున్న 9వ వార్డు

📰 Generate e-Paper Clip

కొద్దిపాటి వర్షానికే జలమయం అవుతున్న 9వ వార్డు

సమస్య పరిష్కరించాలని తంగళ్లపల్లి ప్రజల విజ్ఞప్తి

తంగళ్లపల్లి ప్రజావాణి ఆగస్టు 04 గ్రామపంచాయతీ పాలకవర్గం మారినప్పటికీ గ్రామంలోని సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని తంగళ్లపల్లి గ్రామ 9వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
9వ వార్డులో కొద్దిపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారి పూర్తిగా జలమయం అవుతుండటంతో పాటు వరద నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని వాపోయారు.వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుండటంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, గ్రామపంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, వర్షపు నీరు నిల్వ లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని 9వ వార్డు ప్రజలు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular