**
*వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలి*
*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్*
గూడూరు మండల ప్రతినిధి:- ఆగస్టు 04. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ జిల్లాలోని మండల ప్రాథమిక వైద్యాధికారులతో గూగుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో గూడూరు, కోమట్లగూడెం, కొత్తగూడ, తీగలవేణి, గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటు లో ఉంటాయని, ప్రత్యేకమైన సీజనల్ వ్యాదులలో భాగంగా విష జ్వరాలు, అతిసారం, పాము, తేలు కాటు మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా డెంగ్యూ ,మలేరియా జ్వరముల వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించ వలసిందిగా సూచిస్తూ.. జాతీయ ఆరోగ్య కేంద్రాల పథకాలపై సమీక్షించి, లక్ష్యాలు సాధించాలని సూచించినారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశలు అంగనవాడి సిబ్బంది సమన్వయంతో తల్లి పాల ప్రాముఖ్యతలో కాన్పుకాగానే బిడ్డకు తల్లిపాలు (ముర్రిపాలు) పట్టించవలసిందిగా, ఈ పాలు మొదటి టీకావలె వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, జ్వరాల నియంత్రణలో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా ఉండకుండా డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తూ.. గ్రామపంచాయతీ సిబ్బంది సమన్వయంతో పరిసరాల పరిశుభ్రత, దోమల పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శివకుమార్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, స్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటల వైద్య సేవలు ప్రారంభం
RELATED ARTICLES




