📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguస్నేహమే జీవితానికి అందం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే ప్రత్యేకం

స్నేహమే జీవితానికి అందం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే ప్రత్యేకం

📰 Generate e-Paper Clip

 

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ శ్రీకాంత్ (ప్రజావాణి)*

స్నేహం అనేది రక్త సంబంధం కాదు. అయినా కష్టంలో “నేనున్నాను” అని భరోసా ఇచ్చే పవిత్ర బంధం. కుల, మత, వయసు, లింగ భేదం లేకుండా మనుషులను కలిపే గొప్ప శక్తి స్నేహం.

ప్రతి సంవత్సరం *ఆగస్టు నెలలో మొదటి ఆదివారం* స్నేహితుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 1935లో అమెరికాలో మొదలైన ఈ సంప్రదాయం నేడు ప్రపంచమంతా విస్తరించింది.

*స్నేహానికి గొప్ప ఉదాహరణలు*
రామాయణంలో శ్రీరాముడు-సుగ్రీవుడు, మహాభారతంలో దుర్యోధనుడు-కర్ణుడు, కృష్ణుడు-అర్జునుడు లాంటి బంధాలు స్నేహానికి నిదర్శనాలు. “వందమంది నకిలీ స్నేహితుల కంటే ఒక్క నిజమైన స్నేహితుడు చాలు” అని పెద్దలు చెబుతారు.
*నేటి తరం స్నేహం*
సోషల్ మీడియా యుగంలో ఫాలోవర్లు, లైకులు పెరిగినా… కష్టంలో తోడుగా నిలబడే నిజమైన స్నేహితులు తక్కువయ్యారు. పార్టీలు, గిఫ్టులు, బ్యాండ్లు ముఖ్యం కాదు. మనస్ఫూర్తిగా పలకరించి, చేయూత ఇచ్చేవాడే నిజమైన మిత్రుడు.
ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

*- ప్రజావాణి ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్: గొల్లపెల్లి శ్రీకాంత్*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular