కాలకృత్యాలకు వెళ్లి విషాదం.
పీడ్స్ తో నీటిలో పడి కొల్లూర్ వ్యక్తి మృతి.
కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన సిరిగిరి హనుమంతు తండ్రి సాయి గొండ గ్రామ శివారులో శుక్రవారం కాలకృత్యాలకు వెళ్లారు.ఈ క్రమంలో పీడ్స్ వచ్చి పక్కనే పారుతున్న నీటిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.భారీ వర్షాలతో గ్రామం చుట్టూ నీరు పారుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ లోని జగన్ గ్రామస్థులకు సూచించారు.




