📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetమట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు. 

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు. 

📰 Generate e-Paper Clip

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు.

 

మఠంపల్లి జూలై 29 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మట్టపల్లి మహా క్షేత్రంలో 29-7-2026 బుధవారం ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపునకు దేవాదాయ శాఖ నుండి పర్యవేక్షణ నిమిత్తం కే భాస్కర్, సహాయ కమిషనర్, నల్లగొండ, దేవస్థాన అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్, కార్యనిర్వహణ అధికారి టి వెంకట చలపతి వారల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగినది. 11-5-2026 నుండి 29-7-2026 వరకు 78 రోజులు రెగ్యులర్ హుండీ 12,40,040. అన్నదానము 77,920. మొత్తం కలిపి 13, 17,920 లు వచ్చినవి. ఇట్టి హుండీ లెక్కింపులో శ్రీ సాయి సేవా సంఘం వారు 60 మంది మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular