📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriహబ్సిగూడకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన సైట్ సూపర్‌వైజర్

హబ్సిగూడకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన సైట్ సూపర్‌వైజర్

📰 Generate e-Paper Clip

పోచారం, జూలై 29: హబ్సిగూడలోని బ్యాంకుకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ఓ వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు గల్లంతు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్‌రూం కాలనీ, 7వ బ్లాక్, 2వ అంతస్తులో నివాసముంటున్న కేడాసు లావణ్య తన భర్త కేడాసు ప్రకాశ్ (35) కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ప్రకాశ్ సైట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, 2018లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం సుమారు 3.35 గంటలకు హబ్సిగూడలోని బ్యాంకుకు వెళ్లి త్వరలోనే తిరిగి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ప్రకాశ్ అప్పటి నుంచి ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

గల్లంతైన ప్రకాశ్ ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆకుపచ్చ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆయనకు తెలుగు, హిందీ భాషలు మాట్లాడటం వచ్చని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రకాశ్ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular