పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం చల్వాయి BRS పార్టీ ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):-
తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని గోవిందరావుపేట మండలం చల్వాయి BRS పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫుట్ ఫారం లోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు పూజలు చేసి, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని వేడుకున్నారు.
పూజారి సమ్మయ్య ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్ల ఆశీర్వాదాలు అందించారు.
ఈ సందర్భంగా గోవిందరావుపేట BRS మండల అధ్యక్షులు లకావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ BRS పార్టీ ఎల్లప్పుడూ పెద్ది కుటుంబానికి అండగా ఉంటుందని, సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణచందర్, ఉపసర్పంచ్ భూరెడ్డి మధు, మాజీ సర్పంచ్ ఈసం సమ్మయ్య తో పాటు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీకాంత్*


