పట్నం కుటుంబానికి మాజీ మంత్రుల పరామర్శ
మాతృ యోగానికి గురైన పట్నం కుటుంబాన్ని
బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జడ్పీ ఛైర్మన్ లు పరామర్శించారు.
మాజీ మంత్రులు తన్నీరుహరీష్ రావు,
పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు
పరామర్శించారు.
షాబాద్ లోని మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి నివాసంలో
ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పట్నం మహేందర్ రెడ్డి,పట్నం నరేందర్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డి తో పాటు, కుటుంబ సభ్యులు సునీతా రెడ్డి , నీరజా రెడ్డి, సృతి రెడ్డి, పుల్ల నర్మదా రెడ్డి తదితరులు లను పలుకరించిన హరీష్ రావు. వారు పట్నం కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
తాను గత వారం నీమ్స్ ఆస్పత్రిలో రుక్కమ్మను పలుకరించగా ఉషారుగా మట్లాడిందని హరీష్ రావు, సవిత ఇంద్రారెడ్డి లు చెప్పారు.
రుక్కమ్మ ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు,
మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్,మహేష్ రెడ్డి, ధర్మ రెడ్డి అలాగే మాజీ ఎంపీ మాలోత్ కవిత , మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ జడ్పీ చైర్పర్సన్ బిందు,
డి సి సి బి మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్ యాదవ్
కొలన్ కృష్ణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు మహిపాల్ , యాదగిరి, తదితరులు ఆయనతో ఉన్నారు.


