**
*సింగరేణి ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు*
* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 27
గనుల్లో రక్షణ చర్యలకు ప్రాధాన్యతనిస్తూనే ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు అమలు చేయాలని సింగరేణి ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన ఏరియాలో విస్తృతంగా పర్యటించి పలు ప్రాజెక్టులు, ఉపరితల, భూగర్భ బొగ్గు గనులను పరిశీలించి, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, రవాణా, రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా ఏరియాలోని రామకృష్ణాపూర్ లోని రామకృష్ణాపూర్ ఓసిపి ఫేస్-2 ను సందర్శించి, గని పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏరియాలోని ప్రముఖ కేకే ఓసిపి ని సందర్శించి, ఓసిపి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత గణాంకాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్రైమాసిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్పత్తి వేగాన్ని పెంచాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. తదనంతరం ఏరియాలోని శాంతిఖని గనితో పాటు కాసీపేట-1, కాసీపేట-2 భూగర్భ గనుల మైనింగ్ ప్లాన్లను, అధికారులతో కలిసి సమీక్షించారు. అదేవిధంగా భూగర్భ గనులలో రక్షణ కోసం ఉపయోగించే స్టోవింగ్ బంకర్ల పనితీరును, వాటి నిర్వహణను ఆరా తీశారు. అనంతరం కేకే ఓసిపి రైల్వే సైడింగ్ ను సందర్శించి, వినియోగదారులకు బొగ్గు రవాణా పనులు వేగవంతంగా జరిగేలా రైల్వే సైడింగ్ పనుల పురోగతిని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ , ఎస్ఓటు జిఎం జిఎల్ ప్రసాద్, ఏజిఎం ఈ అండ్ ఎం బాలాజీ భగవతి జ, డీజీఎం సర్వే భుక్యా దేశాయ్, డిజిఎం సివిల్ మదీనా భాష, కేకే ఓసి మేనేజర్ కె రామరాజు, క్వాలిటీ అధికారి ప్రదీప్ , కేకే ఓసి పిఈ వెంకట వంశీధర్, ఏరియా ఎస్ అండ్ పిసి ఎస్ఎస్ఓ వెంకటేశ్వర్ రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.




