రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తికి పెంచాలి
***సింగరేణి ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 27గనుల్లో రక్షణ చర్యలకు ప్రాధాన్యతనిస్తూనే ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు అమలు చేయాలని సింగరేణి ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన ఏరియాలో విస్తృతంగా పర్యటించి పలు ప్రాజెక్టులు, ఉపరితల, భూగర్భ బొగ్గు గనులను పరిశీలించి, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, రవాణా, రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా ఏరియాలోని రామకృష్ణాపూర్ లోని రామకృష్ణాపూర్ ఓసిపి ఫేస్-2 ను సందర్శించి, గని పరిసర...