గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి.
జడ శ్రీనివాస్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు.
మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి)
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు ఇంటి రవి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ లో చేరగా వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ఏఐటీయూసీ కండవలను కప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ దోపిడీ చేసే 51 జీవోను వెంటనే రద్దు చేయాలని, మల్టీపర్పస్ విధానానికి స్వస్తి చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కొరకు ప్రతినిత్యం పనిచేస్తున్న గ్రామపంచాయతీ కమటీలకు అధిక జీతం ఇవ్వాల్సింది పోయి ఉన్న జీతాలు సగానికి ఇవ్వడం దారుణమైన విషయమని, తక్షణమే శ్రమ దోపిడికి వ్యతిరేకంగా సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రాంతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ రన్మియా, ప్రాంతీయ సహాయ కార్యదర్శి దేశబోయిన వీరయ్య, మండల అధ్యక్షుడు చిన్న పొంగు శ్రీను, భగవాన్ కొత్తపల్లి విశాఖ, మాతంగి కొండలు, దుగ్గి సైదులు, మూస, తేలబాటి సత్యనారాయణ రేడపంగు లాజరు, పీవీ నరసింహారావు, మట్టయ్య, వల్లభ దాస్ వీరబాబు, ఎస్ కె సైదెల్లి తదితరులు పాల్గొన్నారు.

