📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadతిరుమలాపూర్ గ్రామ సభలో పలు కఠిన తీర్మానాలు

తిరుమలాపూర్ గ్రామ సభలో పలు కఠిన తీర్మానాలు

📰 Generate e-Paper Clip

తిరుమలాపూర్ గ్రామ సభలో పలు కఠిన తీర్మానాలు.

బహిరంగ మలవిసర్జనకు రూ.5000 జరిమానా.

బాల్య వివాహాలు,మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.

ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి.

గ్రామస్తులకు సర్పంచ్ బోయి సైదవ్వ పిలుపు.

 

కోటగిరి/ప్రజావాణి:-పలు కీలక తీర్మానాల మధ్య పోతంగల్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామసభ సోమవారం సర్పంచ్ బోయి సైదవ్వ అధ్యక్షతన ఘనంగా జరిగింది. గ్రామాభివృద్ధి,ప్రజారోగ్యం,శాంతిభద్రతలపై సభలో విస్తృత చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా పలు తీర్మానాలు గ్రామసభ ద్వారా ఆమోదించారు.

గ్రామ పరిశుభ్రత:-

గ్రామ పరిశుభ్రత కొరకై బహిరంగంగా మలవిసర్జన చేసిన వారికి రూ.5,000 జరిమానా విధించాలని తీర్మానించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు.

బాల్య వివాహాలు:-

గ్రామంలో బాల్య వివాహాలు చేయరాదని తీర్మానించారు.18 సంవత్సరాలలోపు అమ్మాయిలకు అలాగే 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకు వివాహం చేస్తే చట్టరీత్యా కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.

మత్తు పదార్థాలు:-

21 సంవత్సరాలు నిండని వారికి సిగరెట్,గుట్కా,మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని. దుకాణ సముదాయాలలో కాలం చెల్లిన వస్తువులు అమ్మిన వారికి రూ.5,000 జరిమానా ఉంటుందని తెలిపారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు:-

మాదకద్రవ్యాలు సేవించిన వారని గానీ సరఫరా చేసిన వారిని గానీ పట్టించినచో వారికి రూ.10,000 రివార్డు ఇస్తామని ప్రకటించారు.బాధ్యులపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.

అదేవిధంగా గ్రామసభలో ఇంటికి ఇంకుడు గుంత,పొలానికి పంట గుంత నిర్మించుకో వాలని పిలుపునిచ్చారు.కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటి కుళాయిలకు ట్యాబులు పెట్టు కోకుంటే జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ గ్రామ సభలో భాగంగా డ్వాక్రా,బాల గ్రామ సభలు కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్, జీపీ.కార్యదర్శి వెంకటేష్ గౌడ్,వార్డు సభ్యులు ఆస్మా బేగం, రమాబాయి,లక్ష్మీబాయి,లక్ష్మి,కాశయ్య,గ్రామ పెద్దలు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గంగాధర్,లింగయ్య,శంకర్ పటేల్, నాగేశ్వరావు పటేల్,కాలే లాలయ్య,బొంబాయి రాములు, సి.ఏ.అనుజ,ఫీల్డ్ అసిస్టెంట్ జయరాం,మహిళా సంఘాల ప్రతినిధులు హనుమవ్వ,సుజాత,నఫీసా,పోషవ్వ,రుక్క వ్వ,నాగమణి,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.