📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై మేయర్ అసంతృప్తి

ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై మేయర్ అసంతృప్తి

📰 Generate e-Paper Clip

ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి: మేయర్ మహంకాళి స్వామి

రామగుండం 32వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ తోట మమత కుమార్‌తో కలిసి పర్యటించారు. కాలువల్లో పూడికతీత, రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు పనులను పరిశీలించారు. ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతాల్లో సీఏస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. డివిజన్‌లో గుర్తించిన సమస్యలను త్వరలో పరిష్కరించి ప్రాంతాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై మేయర్ అసంతృప్తి

రామగుండం ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిని మేయర్ మహంకాళి స్వామి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రత, మురుగు నీటి నిల్వలు, చెత్త కుప్పలు, పెరిగిన పిచ్చి మొక్కలను పరిశీలించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌టీపీ నిర్మాణం కోసం మూడేళ్లుగా తవ్విన గుంతను వెంటనే పూడ్చాలని, డ్రైనేజీ పైప్‌ల లీకేజీలను అరికట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ తరఫున సహకరిస్తామని, సమస్యలను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular