ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై మేయర్ అసంతృప్తి

ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి: మేయర్ మహంకాళి స్వామి రామగుండం 32వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ తోట మమత కుమార్‌తో కలిసి పర్యటించారు. కాలువల్లో పూడికతీత, రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు పనులను పరిశీలించారు. ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతాల్లో సీఏస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. డివిజన్‌లో గుర్తించిన సమస్యలను త్వరలో పరిష్కరించి ప్రాంతాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై...