📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialపట్టణ ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యుడు రవి మృతి

పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యుడు రవి మృతి

📰 Generate e-Paper Clip

*పట్టణ ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు రవి మృతి*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 26

పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు చింతకింది రవి ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పట్టణంలోని రవి భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, రవి మృతితో ఫోటోగ్రఫీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయని, మృతుడు రవికి భార్య, ఒక కుమారుడు కలరని తెలిపారు. చింతకింది రవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అసోసియేషన్ పక్షాన రవికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  ఈకార్యక్రమంలో యూనియన్
రాష్ట్ర కార్యదర్శి సీపతి రవి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న సుధాకర్, జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జ్ నూనె సురేష్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు రాజబాబు లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.