📄 ePaper
Sunday, July 26, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguపెండింగ్ కేసులపై క్లాసు ప్రజాసేవలో నిర్లక్ష్యం వద్దు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

పెండింగ్ కేసులపై క్లాసు ప్రజాసేవలో నిర్లక్ష్యం వద్దు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

📰 Generate e-Paper Clip

*పెండింగ్ కేసులపై క్లాస్ – ప్రజా సేవలో నిర్లక్ష్యం వద్దు*
.జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్.

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*:-
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.
జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష సమీక్షే లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
తనిఖీని గౌరవ వందనంతో ప్రారంభించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.
రోడ్డు ప్రమాద కేసుల్లోని వాహనాల పురోగతి, పెండింగ్ కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఫిర్యాదారులతో మర్యాదగా వ్యవహరించాలని దరఖాస్తులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రిసెప్షన్ అధికారికి ఆదేశించారు.
కేసుల దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయాలని, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని సూచించారు.
రౌడీ శీటర్లపై తీసుకుంటున్న చర్యలను కూడా సమీక్షించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికీ స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించి, పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం పెంచాలని కోరారు.ఈ తనిఖీల్లో ములుగు డిఎస్పీ రవీందర్, పస్ర సిఐ దయాకర్ పాల్గొన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, నిస్పక్షపాత సేవలు అందించాలని ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular