📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటిన మంత్రి సీతక్క .ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్

ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటిన మంత్రి సీతక్క .ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్

📰 Generate e-Paper Clip

ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటిన మంత్రి సీతక్క
.ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్.

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి డా. దనసరి అనసూయ – సీతక్కకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘన స్వాగతం పలికింది.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
ప్రవాస భారతీయ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన సీతక్క గారి ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది.ప్రజా సంక్షేమ పాలన, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అంతర్జాతీయ వేదికపై సమర్థవంతంగా వివరించారు.తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మంత్రి నాయకత్వాన్ని పైడాకుల అశోక్ ప్రశంసించారు.”ప్రజల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న సీతక్క నాయకత్వంలో ములుగు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మంత్రి స్వదేశాగమన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పైడాకుల అశోక్,మంత్రి సీతక్కకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, నిరంతర విజయాలు కలగాలని కోరారు.
తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular